Sunday, 14 April 2013

చిందు నృత్యం

                                    చిందు నృత్యం 




                          పెద్ద మీసాలు కలిగి , శరీర సౌష్టవం కలిగిన హరిజన కులానికి చెందిన పురుషులు చేసే నృత్యం చిందు నృత్యం. పంచెను దోవతిలా కట్టుకొని, తలకు గుడ్డ చుట్టుకుంటారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకొని ,చేతిలో  చిన్నకర్రను పట్టుకొని డప్పుల శబ్దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు.   చిందు    కళాకారులు మద్యాన్ని సేవించి ఈ నృత్యాన్ని ప్రదర్శించడం గమనార్హం. చిందు కళాకారుడు తన ఎడమచేతిలో  ఉన్న    చిన్నకర్రను  చేతితో అటూ ఇటూ తిప్పుతూ , మరో చేతిని గాలిలో తిప్పుతూ ,కొద్దిసేపు నడుమును కుడిచేత్తో  పట్టుకొని లయాత్మకంగా తన శరీర భాగాలను కదిలిస్తూ నృత్యం చేస్తాడు. డప్పు శబ్దం వీరి నృత్యానికి ఉత్సాహాన్ని చేకూరుస్తుంది. డప్పులు లేనిదే ఈ నృత్యం చేయడం వీలుకాదు. ఈ చిందు నృత్యాన్ని చూడడానికి ప్రేక్షకులు ఉత్సవాలలో , తిరునాళ్ళలో అత్యుత్సాహాన్ని చూపుతారు .  

No comments:

Post a Comment