Tuesday, 16 April 2013

నాటక ప్రస్థానం

                                                తెలుగు నాటక రంగ దినోత్సవం :
               నేడు కందుకూరి  వీరేశలింగం జయంతి సందర్భంగా  'తెలుగు నాటక రంగ దినోత్సవం'ను  ప్రతి తెలుగు భాషాభిమాని మరియు సాహిత్యాభిమాని జరుపుకోవాలి.   తెలుగు భాష ఉన్నతికి  అవిరళ కృషి  చేసిన మన కందుకూరి వీరేశలింగంగారిని ఈ సందర్భంగా అందరూ స్మరించు కోవాలి. 
పరిచయం:
జననం : ఏప్రిల్ 16, 1848 - రాజమండ్రి 
తల్లి : పున్నమ్మ 
తండ్రి :సుబ్బరాయుడు 
వివాహం : 1861 లో 
భార్య : రాజ్యలక్ష్మి 
ఈయన బహుభాషాకోవిధులు 
బిరుదులు : యుగకర్త , గద్యతిక్కన ,రావుబహద్దూర్ 
               సాహిత్యం తో సామాజిక చైతన్యం  కలిగించిన నవ సమాజ నిర్మాత కందుకూరి. ఈయన పేరు వినగానే స్త్రీవిద్య ,బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాటం ,వితంతు వివాహాలు మొదలైనవి గుర్తుకువస్తాయి.పంతులుగారు ప్రజలలో గల మూఢ నమ్మకాలను పోగొట్టడానికి అనేక రచనలు చేసారు. ఒక విధంగా చెప్పాలంటే నవ్యసాహిత్య ప్రక్రియలకన్నిటికీ స్థితినీ , ప్రాచుర్యమును  కల్పించినవారు వీరేశలింగంపంతులు గారు. పద్యకావ్యాలు, నాటకాలు, నవలలు, ప్రహసనాలు, కథలు, వ్యాసాలు, చరిత్రలు  మొదలైన  రచనలు చేయడంతో పాటు వివేకవర్ధిని, సతీహిత బోధిని , సత్య సంవర్ధిని, సత్యదూత, చింతామణి లాంటి పత్రికలూ నడిపారు. ఈవిధంగా  సాహితీ క్షేత్రంలో నిత్యకృషీవలుడై ఆంధ్రజాతిని సంస్కరించిన ఈ సంస్కర్త మే 27, 1919న తనువుచాలించారు.
             చిలకమర్తి వారు  పంతులుగారి గురించి -
                                         "తన దేహము తన గేహము 
                                          తన కాలము తన ధనమ్ము తన విద్య  జగ
                                          జ్జనులకు వినియోగించిన 
                                          ఘనుడీ వీరేశలింగ కవి జనులారా!" అన్నారు.            

        




                                                                                                              

No comments:

Post a Comment