Thursday, 18 April 2013

తెలుగుకు మరో జ్ఞానపీఠం

-

తెలుగు జాతి గర్వించ దగిన రోజు 

                 తెలుగు సాహిత్యానికి మరో  జ్ఞానపీఠం రావడం తెలుగు జాతి మొత్తం గర్వించదగిన విషయం. ఈ సందర్భంగా రావూరి భరద్వాజ గారికి శుభాకాంక్షలు. 

జననం : జూలై 5 , 1927 (మొగల్తూరు,పశ్చిమ గోదావరి జిల్లా)
పురస్కారాలు:డి.లిట్.(నాగార్జున విశ్వవిద్యాలయం & జె.ఎన్.టి.యు.), కళాప్రపూర్ణ (ఆంధ్ర విశ్వవిద్యాలయం),      కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం, రాష్ట్ర సాహిత్య అకాడమి పురస్కారాలతో పాటు ప్రస్తుతం భారతీయ       సాహిత్యంలో  అత్యున్నత పురస్కారమైన  జ్ఞానపీఠం  ఈయనను వరించింది.సినిమా (అధో)జగత్తు పై ఆయన రాసిన పాకుడు రాళ్ళు రచనకు   జ్ఞానపీఠం వచ్చింది.ఇది మన తెలుగు సాహిత్యానికి మరియు తెలుగు జాతికి గర్వకారణం.
రచనలు :నేనెందుకు రాస్తున్నాను(సామాజికవ్యాసాలు)-1978,శ్రీరస్తు (కథలు)-1987,శూన్యం నుంచి సృష్టి -1992,
వ్యాసమంజరి (సామాజికవ్యాసాలు)-1981,వేకువ(సాంఘికనవల)-1973,వినువీధిలో వింతలు(ఖగోళ విజ్ఞానం)- 1982,  విజయవిలాసం(కథలు)-1967, మొనలేని శిఖరం(కథలు)-1961,ఫాసిజం చనిపోయిందా ? జీవించి వుందా? -1990, ప్లాస్టిక్ ప్రపంచం(రసాయనశాస్త్రం)-1966,పాలపుంత(కథలు)-1961, పాకుడురాళ్ళు (సాంఘిక నవల)-1978, పద్దు తెచ్చిన ముద్దు తమ్ముడు(కథలు)-1970,నాలోని నీవు-1987, తెలివైన దొంగ(కథలు)-1967,జీవన సమరం (కథలు)-1981,జీవనది (నాటిక)-1974,చిలక తీర్పు(కథలు)-1980,కాదంబరి(సాంఘిక నవల)-1978,కంచికి వెళ్ళిన కథ(సారస్వత కావ్యం)-1967,ఇనుప తెర వెనుక....(సోవియట్ రష్యా పర్యటనఅనుభవాలు)-1988,ఇదంజగత్ (సాంఘినవల)-1967,ఆత్మగతం(నాటికలు)-1962,సౌందరనందం(సాంఘికనవల)-1987,నౌందనందం(కథలు), అయినా ఒక ఏకాంతం-1990,అంతరంగిణి-1989 ......... మొదలైనవి. 

No comments:

Post a Comment