Thursday, 18 April 2013
శ్రీ రామనవమి
శ్రీ రామనవమి శుభాకాంక్షలు
మిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ,
రామాయణం అంటే రామునిమార్గమ్.ఆ మార్గం అసత్యాన్ని,అధర్మాన్ని
అంతమొందించి, సత్యాన్ని,ధర్మాన్ని నిలిపిన మార్గం. ఆ మార్గమే అందరు
అనుసరించదగిన మార్గం......
నవవసంత శుభోదయంలో
భూలోకమే కళ్యాణవేదిక
ఆకాశంలో ఆనందాల తోరణాలు
ప్రాణికోటి దరహాస హేళ
ముక్కోటి దేవతల కుసుమ సంగీత మేళ
అదే సీతారాముల కళ్యాణ వేళ
ఈ జగతికిదే నిత్యకళ్యాణ మాల..
తెలుగుకు మరో జ్ఞానపీఠం
-
తెలుగు జాతి గర్వించ దగిన రోజు
తెలుగు సాహిత్యానికి మరో జ్ఞానపీఠం రావడం తెలుగు జాతి మొత్తం గర్వించదగిన విషయం. ఈ సందర్భంగా రావూరి భరద్వాజ గారికి శుభాకాంక్షలు.
జననం : జూలై 5 , 1927 (మొగల్తూరు,పశ్చిమ గోదావరి జిల్లా)
వ్యాసమంజరి (సామాజికవ్యాసాలు)-1981,వేకువ(సాంఘికనవల)-1973,వినువీధిలో వింతలు(ఖగోళ విజ్ఞానం)- 1982, విజయవిలాసం(కథలు)-1967, మొనలేని శిఖరం(కథలు)-1961,ఫాసిజం చనిపోయిందా ? జీవించి వుందా? -1990, ప్లాస్టిక్ ప్రపంచం(రసాయనశాస్త్రం)-1966,పాలపుంత(కథలు)-1961, పాకుడురాళ్ళు (సాంఘిక నవల)-1978, పద్దు తెచ్చిన ముద్దు తమ్ముడు(కథలు)-1970,నాలోని నీవు-1987, తెలివైన దొంగ(కథలు)-1967,జీవన సమరం (కథలు)-1981,జీవనది (నాటిక)-1974,చిలక తీర్పు(కథలు)-1980,కాదంబరి(సాంఘిక నవల)-1978,కంచికి వెళ్ళిన కథ(సారస్వత కావ్యం)-1967,ఇనుప తెర వెనుక....(సోవియట్ రష్యా పర్యటనఅనుభవాలు)-1988,ఇదంజగత్ (సాంఘినవల)-1967,ఆత్మగతం(నాటికలు)-1962,సౌందరనందం(సాంఘికనవల)-1987,నౌందనందం(కథలు), అయినా ఒక ఏకాంతం-1990,అంతరంగిణి-1989 ......... మొదలైనవి.
పురస్కారాలు:డి.లిట్.(నాగార్జున విశ్వవిద్యాలయం & జె.ఎన్.టి.యు.), కళాప్రపూర్ణ (ఆంధ్ర విశ్వవిద్యాలయం), కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం, రాష్ట్ర సాహిత్య అకాడమి పురస్కారాలతో పాటు ప్రస్తుతం భారతీయ సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠం ఈయనను వరించింది.సినిమా (అధో)జగత్తు పై ఆయన రాసిన పాకుడు రాళ్ళు రచనకు జ్ఞానపీఠం వచ్చింది.ఇది మన తెలుగు సాహిత్యానికి మరియు తెలుగు జాతికి గర్వకారణం.
రచనలు :నేనెందుకు రాస్తున్నాను(సామాజికవ్యాసాలు)-1978,శ్రీరస్తు (కథలు)-1987,శూన్యం నుంచి సృష్టి -1992,వ్యాసమంజరి (సామాజికవ్యాసాలు)-1981,వేకువ(సాంఘికనవల)-1973,వినువీధిలో వింతలు(ఖగోళ విజ్ఞానం)- 1982, విజయవిలాసం(కథలు)-1967, మొనలేని శిఖరం(కథలు)-1961,ఫాసిజం చనిపోయిందా ? జీవించి వుందా? -1990, ప్లాస్టిక్ ప్రపంచం(రసాయనశాస్త్రం)-1966,పాలపుంత(కథలు)-1961, పాకుడురాళ్ళు (సాంఘిక నవల)-1978, పద్దు తెచ్చిన ముద్దు తమ్ముడు(కథలు)-1970,నాలోని నీవు-1987, తెలివైన దొంగ(కథలు)-1967,జీవన సమరం (కథలు)-1981,జీవనది (నాటిక)-1974,చిలక తీర్పు(కథలు)-1980,కాదంబరి(సాంఘిక నవల)-1978,కంచికి వెళ్ళిన కథ(సారస్వత కావ్యం)-1967,ఇనుప తెర వెనుక....(సోవియట్ రష్యా పర్యటనఅనుభవాలు)-1988,ఇదంజగత్ (సాంఘినవల)-1967,ఆత్మగతం(నాటికలు)-1962,సౌందరనందం(సాంఘికనవల)-1987,నౌందనందం(కథలు), అయినా ఒక ఏకాంతం-1990,అంతరంగిణి-1989 ......... మొదలైనవి.
Tuesday, 16 April 2013
నాటక ప్రస్థానం
తెలుగు నాటక రంగ దినోత్సవం :
నేడు కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా 'తెలుగు నాటక రంగ దినోత్సవం'ను ప్రతి తెలుగు భాషాభిమాని మరియు సాహిత్యాభిమాని జరుపుకోవాలి. తెలుగు భాష ఉన్నతికి అవిరళ కృషి చేసిన మన కందుకూరి వీరేశలింగంగారిని ఈ సందర్భంగా అందరూ స్మరించు కోవాలి.
పరిచయం:
జననం : ఏప్రిల్ 16, 1848 - రాజమండ్రి
తల్లి : పున్నమ్మ
తండ్రి :సుబ్బరాయుడు
వివాహం : 1861 లో
భార్య : రాజ్యలక్ష్మి
ఈయన బహుభాషాకోవిధులు
బిరుదులు : యుగకర్త , గద్యతిక్కన ,రావుబహద్దూర్
సాహిత్యం తో సామాజిక చైతన్యం కలిగించిన నవ సమాజ నిర్మాత కందుకూరి. ఈయన పేరు వినగానే స్త్రీవిద్య ,బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాటం ,వితంతు వివాహాలు మొదలైనవి గుర్తుకువస్తాయి.పంతులుగారు ప్రజలలో గల మూఢ నమ్మకాలను పోగొట్టడానికి అనేక రచనలు చేసారు. ఒక విధంగా చెప్పాలంటే నవ్యసాహిత్య ప్రక్రియలకన్నిటికీ స్థితినీ , ప్రాచుర్యమును కల్పించినవారు వీరేశలింగంపంతులు గారు. పద్యకావ్యాలు, నాటకాలు, నవలలు, ప్రహసనాలు, కథలు, వ్యాసాలు, చరిత్రలు మొదలైన రచనలు చేయడంతో పాటు వివేకవర్ధిని, సతీహిత బోధిని , సత్య సంవర్ధిని, సత్యదూత, చింతామణి లాంటి పత్రికలూ నడిపారు. ఈవిధంగా సాహితీ క్షేత్రంలో నిత్యకృషీవలుడై ఆంధ్రజాతిని సంస్కరించిన ఈ సంస్కర్త మే 27, 1919న తనువుచాలించారు.
చిలకమర్తి వారు పంతులుగారి గురించి -
"తన దేహము తన గేహము
తన కాలము తన ధనమ్ము తన విద్య జగ
జ్జనులకు వినియోగించిన
ఘనుడీ వీరేశలింగ కవి జనులారా!" అన్నారు.
నేడు కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా 'తెలుగు నాటక రంగ దినోత్సవం'ను ప్రతి తెలుగు భాషాభిమాని మరియు సాహిత్యాభిమాని జరుపుకోవాలి. తెలుగు భాష ఉన్నతికి అవిరళ కృషి చేసిన మన కందుకూరి వీరేశలింగంగారిని ఈ సందర్భంగా అందరూ స్మరించు కోవాలి.

జననం : ఏప్రిల్ 16, 1848 - రాజమండ్రి
తల్లి : పున్నమ్మ
తండ్రి :సుబ్బరాయుడు
వివాహం : 1861 లో
భార్య : రాజ్యలక్ష్మి
ఈయన బహుభాషాకోవిధులు
బిరుదులు : యుగకర్త , గద్యతిక్కన ,రావుబహద్దూర్
సాహిత్యం తో సామాజిక చైతన్యం కలిగించిన నవ సమాజ నిర్మాత కందుకూరి. ఈయన పేరు వినగానే స్త్రీవిద్య ,బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాటం ,వితంతు వివాహాలు మొదలైనవి గుర్తుకువస్తాయి.పంతులుగారు ప్రజలలో గల మూఢ నమ్మకాలను పోగొట్టడానికి అనేక రచనలు చేసారు. ఒక విధంగా చెప్పాలంటే నవ్యసాహిత్య ప్రక్రియలకన్నిటికీ స్థితినీ , ప్రాచుర్యమును కల్పించినవారు వీరేశలింగంపంతులు గారు. పద్యకావ్యాలు, నాటకాలు, నవలలు, ప్రహసనాలు, కథలు, వ్యాసాలు, చరిత్రలు మొదలైన రచనలు చేయడంతో పాటు వివేకవర్ధిని, సతీహిత బోధిని , సత్య సంవర్ధిని, సత్యదూత, చింతామణి లాంటి పత్రికలూ నడిపారు. ఈవిధంగా సాహితీ క్షేత్రంలో నిత్యకృషీవలుడై ఆంధ్రజాతిని సంస్కరించిన ఈ సంస్కర్త మే 27, 1919న తనువుచాలించారు.
చిలకమర్తి వారు పంతులుగారి గురించి -
"తన దేహము తన గేహము
తన కాలము తన ధనమ్ము తన విద్య జగ
జ్జనులకు వినియోగించిన
ఘనుడీ వీరేశలింగ కవి జనులారా!" అన్నారు.
Monday, 15 April 2013
తెలుగు భాష మధురం
ఏ భాష నీది ఏమి వేషమురా
ఈ భాష ఈ వేషమెవరి కోసమురా
ఆంగ్లమందున మాటలనగానే
ఇంత కుల్కెద వెన్దుకురా
తెలుగు వాడివై తెలుగు రాదనుచు
సిగ్గులేక ఇంక చెప్పు టెందుకురా
అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా
- కాళోజీ
ఈ భాష ఈ వేషమెవరి కోసమురా
ఆంగ్లమందున మాటలనగానే
ఇంత కుల్కెద వెన్దుకురా
తెలుగు వాడివై తెలుగు రాదనుచు
సిగ్గులేక ఇంక చెప్పు టెందుకురా
అన్యభాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా
- కాళోజీ
Sunday, 14 April 2013
చిందు నృత్యం
చిందు నృత్యం
పెద్ద మీసాలు కలిగి , శరీర సౌష్టవం కలిగిన హరిజన కులానికి చెందిన పురుషులు చేసే నృత్యం చిందు నృత్యం. పంచెను దోవతిలా కట్టుకొని, తలకు గుడ్డ చుట్టుకుంటారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకొని ,చేతిలో చిన్నకర్రను పట్టుకొని డప్పుల శబ్దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారు. చిందు కళాకారులు మద్యాన్ని సేవించి ఈ నృత్యాన్ని ప్రదర్శించడం గమనార్హం. చిందు కళాకారుడు తన ఎడమచేతిలో ఉన్న చిన్నకర్రను చేతితో అటూ ఇటూ తిప్పుతూ , మరో చేతిని గాలిలో తిప్పుతూ ,కొద్దిసేపు నడుమును కుడిచేత్తో పట్టుకొని లయాత్మకంగా తన శరీర భాగాలను కదిలిస్తూ నృత్యం చేస్తాడు. డప్పు శబ్దం వీరి నృత్యానికి ఉత్సాహాన్ని చేకూరుస్తుంది. డప్పులు లేనిదే ఈ నృత్యం చేయడం వీలుకాదు. ఈ చిందు నృత్యాన్ని చూడడానికి ప్రేక్షకులు ఉత్సవాలలో , తిరునాళ్ళలో అత్యుత్సాహాన్ని చూపుతారు .
ప్రదర్శన కళలు
ప్రదర్శన కళలు
ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలో అనేక జానపద కళలను ప్రజల కళ్ళ ముందు ప్రదర్శన ఇవ్వడం ద్వారా జానపద కళాకారులు ఈ కళలకు జీవం పోస్తున్నారు. వన్నె తగ్గని ఈ కళా రూపాలు ఎప్పటికీ
ఉన్నత స్థానంలోనే ఉంటాయి.
Tuesday, 9 April 2013
సంస్కృతి
భారతీయ సంస్కృతిని ప్రభావితం చేసినవి ముఖ్యంగా మూడు గ్రంధాలు.అవి
1.రామాయణం
2.మహాభారతం
3.భాగవతం
1.రామాయణం
2.మహాభారతం
3.భాగవతం
ప్రాచీన కాలం నుండి మన సంస్కృతిని తెలుసుకోవడానికి ఈ గ్రంధాలే మనకు ఆధారాలు.
అంతేకాక మన సంస్కృతికి ఆధారాలుగా దేవాలయాలు, కోటలు, శిల్పాలు , సంస్కృత కావ్యాలు, దేశభాషా కావ్యాలు, సంగీతం, చిత్రకళలు, జానపద కళలు మొదలయినవిగా చెప్పుకోవచ్చు .
Tuesday, 2 April 2013
Subscribe to:
Posts (Atom)