Thursday, 1 August 2013

ఆంధ్రమాత (ఆత్మ)ఘోష

యాభై ఆరేళ్ళు సాగిన 
స్వతంత్రతా సహగమనం, సహజీవనం
అపసవ్య భావాలతో
అంతులేని ఆక్రోశంతో 
ఆవేదనల కొలిమికి ఆహుతై .... 
అన్నదమ్ముల వలె  మసలిన మనసుల మధ్య
రగిలిన ప్రాంతీయతా చిచ్చు 
ఈ పాపం ఎవరిదైనా 
బలైనది తెలుగు నేల 
నిలువునా చీలి 
అసహాయతతో చూస్తున్నవైనం 
చివికిపోయిన మానవతాహృదయంలో 
కరడుగట్టిన మూర్ఖత్వపు వైఖరి 
అలనాటి భరతమాత కడుపుకోత
అనుభవిస్తున్నది నేడు ఆంధ్రమాత. 
                        - జూలై 30,2013 సాయంత్రం5గంటలు,న్యూఢిల్లీ.  

No comments:

Post a Comment